- Advertisement -
అమ్మాయి పేరు ఎంత బాగుందో ‘సహస్ర!’
వేయి మంచి గుణాలున్న బిడ్డ అని అర్థం!
సహస్ర అంటే వెయ్యి సంవత్సరాలు కాదుు
అమ్మాయి వంద సంవత్సరాలైనా బతుకలే
సహస్ర పేరు ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటారా!
సహస్రనామాలు జపిస్తుంటేనూ
ఎవరికైనా ఈ బిడ్డనే యాదికొస్తుంది కదా
ఏం దేవుడూ అనిపిస్తుంది కడుపు కోతగా!
తల్లి తండ్రులు పిల్లలను క్రమశిక్షణగా పెంచకపోతే
ఇలాంటి సహస్రలు హత్యగా అల్పాయుష్కులే
మీ పిల్లలను జాగ్రత్తగా నేరాల ఆలోచనలు రాకుండా పెంచండి –
భవిష్యత్తు సహస్రలను రక్షించండి
లేకుంటే బాల నేరస్థులతో భారత దేశం నిండిపోయింది !!
(ఇటీవల జరిగిన ఘోరకలి ‘సహస్ర’ హత్యకు స్పందించి)
కందాళై రాఘవాచార్య, 8790593638
- Advertisement -