Tuesday, November 4, 2025
E-PAPER
Homeకరీంనగర్సమస్యలు పరిష్కరించే వారికే మా ఓటు..

సమస్యలు పరిష్కరించే వారికే మా ఓటు..

- Advertisement -

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పనిచేసే వారికే పట్టం..
వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం..
నవతెలంగాణ – వేములవాడ

డిసెంబర్‌లో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే వారికే ఓటు వేస్తామని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం తెలిపారు. మంగళవారం హైకోర్టు ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న రాపోలు భాస్కర్ వేములవాడ బార్ అసోసియేషన్ హాల్‌కు విచ్చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

సదానందం మాట్లాడుతూ.. గతంలో బార్ కౌన్సిల్ సభ్యులుగా గెలిచిన వారు న్యాయవాదుల సమస్యలను పట్టించుకోలేదని, చాలా మంది న్యాయవాదులు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి నిజంగా పనిచేసే వారికి మాత్రమే పట్టం కట్టాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, కోళ్ల శ్రీనివాస్, న్యాయవాదులు   తోపాటు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -