Monday, December 8, 2025
E-PAPER
Homeఖమ్మంమా ఓట్లు కొనబడవు 

మా ఓట్లు కొనబడవు 

- Advertisement -

– అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబిస్తున్న యువకుడి ఆలోచన
– గేటు కు ప్లెక్సీ ఏర్పాటు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికల క్రతువు నడుస్తున్న తరుణంలో ఓటు హక్కు దుర్వినియోగం విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఓ యువకుడు వినూత్న ఆలోచనతో ఓటర్లు దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఓటు విలువను,రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాన్ని చాటి చెబుతూ ఇంటి గేటు కే ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచాడు.

మండలంలోని తిరుమలకుంట పంచాయితి కి చెందిన గడ్డం పుల్లారావు – లక్ష్మి ల తనయుడు గడ్డం సతీష్ గౌడ్ ఈ వినూత్న ఆచరణ చేపట్టారు. సాధారణంగా ప్రజలు తమ ఇంటి గేటు పై శుభకార్యాల వివరాలు,దుకాణం బోర్డు లు పెట్టడం చూస్తుంటాం. కానీ సతీష్ గౌడ్ తన ఇంటి ప్రధాన గేటుకు “మా ఇంటి ఓట్లు అమ్మ బడవు” అనే సందేశంతో కూడిన ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేశారు.

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం
ఈ ఫ్లెక్సీ లో కేవలం నిరసన స్పూర్తి సందేశం మాత్రమే కాకుండా డాక్టర్ బీమ్ రావు అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబిస్తూ, ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే స్పష్టమైన సందేశాన్ని సైతం పొందుపర్చారు. “నిజాయితీ ఓటు హక్కు వినియోగం తోనే  మనం మంచి పాలకులను ఎన్నుకుంటాం. దానిని తెలివిగా ఉపయోగించాలి.ఓటు కొన్నా – అమ్ము కున్నా మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మంచి నాయకుడిని ఎంచు కోవాల్సిన బాధ్యత మన అందరిది!

ప్రజలకు స్పష్టమైన సందేశం
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును అమూల్యం గా భావించి, స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని విక్రయించడాన్ని నివారించాలనేదే తన ముఖ్య ఉద్దేశమని సతీష్ గౌడ్ తెలియజేశారు.ఒక్క ఓటు క్రయ విక్రయాలకు దారి తీసినా, అది యావత్తు  సమాజ భవిష్యత్తుకు నష్టమని ఆయన ప్రజలకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.తాజాగా ఈ వినూత్న ప్రదర్శన సదరు గ్రామంలోనే కాక, పరిసర ప్రాంతాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసి మంచి స్పందన తెస్తోంది. సతీష్ గౌడ్ యొక్క ఈ ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -