Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే మా ఓట్లు

సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే మా ఓట్లు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తమ కాలనీలో సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే మా కాలనీవాసుల ఓట్లు వేస్తామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. మండలంలోని ఉప్లూర్ సురేష్ నగర్ కాలనీలో డ్రైనేజి లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరును గుండా నడిచి వెళ్లేందుకు కూడా వెళ్లలేని పరిస్థితి కాలనీవాసులకు నెలకొంది. తమను కనీసం పట్టించుకునే నాథుడే లేడని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మా సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చివారికే మా కాలనీ వాసుల ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -