Monday, July 28, 2025
E-PAPER
Homeదర్వాజనింగికిచ్చిన అప్పు

నింగికిచ్చిన అప్పు

- Advertisement -

కళ్ళని ఆకాశానికి అరువుగా ఇచ్చింది
మనసేమో మట్టిలో దాచి పెట్టింది
ఊహలు మరో లోకానికి రెక్కలు తొడిగాయి
గాయాలు గుండెల్లో గుచ్చుకొని మంట పెట్టాయి
కడకు ఊపిరి కూడా కష్టమైపోయింది
జీవితంలో ఇక జీవితమే లేకుండా పోయింది.
ఇంతటి శూన్యాన ఒక వెలుగు కోసం ఎదురుచూసింది
ఎన్ని ఏళ్లయినా ఆ వెలుగు రాలేదు
ఆశతో ఆకాశానికేగి, తీర్చని అప్పుని ఆ నింగికిచ్చి
కనిపించని కారు మబ్బుల్లో మటుమాయమైంది
– బాలాజీ పోతుల, 8179283830

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -