Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి.జయలక్ష్మి, ఆర్‌.నీలాదేవి

తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి.జయలక్ష్మి, ఆర్‌.నీలాదేవి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి.జయలక్ష్మి, ఆర్‌.నీలాదేవి ఎన్నికయ్యారు. మహబూబ్‌ నగర్‌లో 26,27 తేదీల్లో జరిగిన యూనియన్‌ రాష్ట్ర మహా సభలో నూతన కమిటీని ఎన్నుకున్నట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు. కోశాధికారిగా పి.గంగమణి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కె. సునీత, మెట్టు కొండాలక్మి, ఎన్‌. పద్మ, టి. యాదమ్మ, పి. కళావతి, ఎ. సునీత, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎం. శ్రీలత, వై. యశోద, డి. ధనలక్ష్మి, ఎం. బాలమణి, ఎం. రేవతి, టి. వెంకటమ్మ నలుగురు కో-ఆప్షన్‌తో కలిపి మొత్తం 19 మంది ఆఫీస్‌ బేరర్స్‌, 58 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను మహాసభ ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -