- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్: వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో వేగవంతంగా కొనుగోలు చేయాలని డీసీఓ రామ్మోహన్ సూచించారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎఫ్ ఏ క్యూ ప్రకారం కొనుగోలు చేయాలని సొసైటీ సీఈవో మహేశ్వరికి తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో వరి ధాన్యం కుప్పలపై టార్పల్లిన్ కవర్లు కప్పుకోవాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సన్ ఇంచార్జ్, భిక్కనూర్ క్లస్టర్ అధికారి రమేష్, సొసైటీ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



