భారీ వర్షానికి సబ్ స్టేషన్ లోకి వచ్చిన వరద నీరు
ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షం..
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా మంగళవారం సాయత్రం నుండి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈదురు గాలులతో ఎడతెరిపి లేకుండా త్రిపురారం, నిడమానూరు, అనుముల, తిరుమలగిరి, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో భారీ వర్షం పడుతుంది. పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఏకంగా విద్యుత్ సబ్ స్టేషన్ లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాత్రి నుండి విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గం వ్యాప్తంగా వరి,పంటలు గాలి వాటుకు నేలకు వాలాయి. పెద్దవూర మండలం లో మల్ల వానికుంట,చలకుర్తి,చింతపల్లి తండ,తుంగతుర్తి,నాయినవాని కుంట తండా వర్షానికి పొలాల మునిగిపోయాయి. పత్తి తడిసి ముద్దగా మారాయి.చాలా చోట్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ శాఖ అధికారులు స్పందించి జేసీబీ సహాయంతో వరద నీరు తొలగించారు. దీంతో రాత్రి నుండి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏర్పడింది. నియోజకవర్గం వ్యాప్తంగా వరి,పంటలు గాలి వాటుకు నేలకు వాలాయి.ఇక పత్తి పంట వర్షానికి తడిసి ముద్దగా మారాయి. తిరుమల గిరి మండలం లో బర్ల బంధo, ఉదృతంగా ప్రవహించడం తో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుర్రం పోడు మండల కేంద్రం నాంపల్లి రోడ్డులో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం తో ఇంటి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈ వరద నీరు ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటలు పూర్తిగా నేలకు వాలాయి పత్తి పంట కూడా తడిసి ముద్దు కావడం తో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చింతపల్లి తండాలో నీట మునిగిన పొలాలు
పెద్దవూర మండలం చింతపల్లి తండా గ్రామంలోని బ్రిడ్జి పైనుంచి వర్షం వరద రావడం వల్ల ప్రజలు రైతులు బయటికి వెళ్లడానికి వీలు లేకపోవడం చాలా పంట పొలాలు దాదాపు 100 ఎకరాలు వరి పొలాలు నీట మునిగాయి. వర్షానికి భూమికి ఆనుకున్నాయి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో తుఫాన్ చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి ప్రజలు రైతులు ట్రాన్స్ఫారం దగ్గర వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉండడంవల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. చింతపల్లి తండా వాగు పై నాగార్జునసాగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి తప్పనిసరిగా మా తండా బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని ఈ విషయం ఎంఎల్ ఏ దృష్టికీ తీసుకెళ్ళామని, ప్రజలు తెలిపారు.




