- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. అంసెబ్లీలో కాళేశ్వరంపై కాంగ్రెస్ డొల్లతనాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎండగట్టారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లను ఆయన మొక్కారంటూ కవిత ఆరోపించడం బాధ కలిగించిందని తెలిపారు. ‘‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో ఆమె వెళ్తున్నారు. కేసీఆర్ కుమార్తెగా గౌరవాన్ని నిలుపుకోలేకపోయారు. అమె తన గొయ్యి తానే తవ్వుకున్నారు’’ అని పద్మా దేవేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
- Advertisement -