నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యసభలో మోడీ సర్కార్ పై ఎంపీ మల్లిఖార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. నిఘా వైఫల్యంతోనే పెహల్గాం ఎటాక్ జరిగిందన్నారు. సీజ్ ఫైర్ జరిగినట్టు ముందుగా యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించడమేంటని రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రంప్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందం తన వల్లే జరిగిందని ప్రకటిస్తున్నా..మోడీ సర్కార్ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉందని మండిపడ్డారు. అనవసరంగా కాంగ్రెస్ ను నిందిస్తూ..బీజేపీ నేతలు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. పహల్గాం దాడిపై ముందస్తు సమాచారమున్న..ఎందుకు భద్రతా బలగాలను అప్రమత్తం చేయలేదని ఖర్గే ప్రశ్నించారు.
విశ్వగురుగా చెప్పుకునే మోడీకి ఏ దేశం కూడా మద్దత ఇవ్వలేదని, షేక్ హ్యాండ్‌లతో, ఫోటోలకు పోజులతో ఇండియాకు సాధించింది ఏమి లేదని, మోడీ పాలనలో విదేశాంగ విధానం గాడీ తప్పిందని ఖర్గే ఆరోపించారు. దేశంలో పలుమార్లు ఉగ్రవాదులు దాడి చేసిన విశ్వగురు మోడీ, వాటిని అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి పీఎం,హోంమంత్రి, రక్షణ మంత్రుల్లో బాధ్యత వహించి, ఎవరూ రాజీనామా చేస్తారని సవాల్ చేశారు.
మోడీ పాలనలో ఆడబిడ్డలకు భద్రత కరువైందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజురోజుకు హత్య పెరిగిపోయి..శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకు ఇటీవల బీహార, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన హత్యలే నిదర్శమన్నారు. మోడీ పాలనలో చెప్పుకోదగిన సంస్కరణలు ఏమిలేవని, ఇంకా నెహ్రూ చేసిన సంస్కరణులతో దేశంలో పాలన నడుస్తుందన్నారు.