- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడిన పాక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 30% పెరగడంతో, పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో 11 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉండటంతో, విద్యా సంస్థలకు సెలవులు, ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం వంటి చర్యలు చేపట్టారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కఠిన నిర్ణయాలు ప్రకటించారు. చైనా, సౌదీ అరేబియా, ఐఎంఎఫ్‌ల నుంచి పాక్ సహాయం కోరుతోంది.
- Advertisement -



