నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ మహాదేవ్ తో పహల్గాం ఉగ్రదాడి ముష్కరులను హతం చేశామని పీఎం మోడీ అన్నారు.ఇవాళ ఆయన వారణాసిలోని కాశీ క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి సభలో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తాను కాశీకి రావడం ఇదే తొలిసారి అని కామెంట్ చేశారు. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని.. తన హృదయం దు:ఖంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ డ్రోన్లు, మిసైళ్ల దెబ్బకు పాకిస్థాన్ వణికిపోయిందని కామెంట్ చేశారు. నేటికి ఆ దేశ ఎయిర్ బేస్‌లు అన్ని ఐసీయూ (ICU)లో పడి ఉన్నాయని సెటైర్లు వేశారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాదేవ్ పాదాలకు, సిదూరం కోల్పోయిన మహిళలకు అంకితం చేస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.
ఇండియన్ మిసైళ్ల దెబ్బకు పాకిస్థాన్ వణికిపోయింది: పీఎం మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES