Wednesday, January 7, 2026
E-PAPER
Homeపరిశోధనపాతరాతియుగం పనిముట్ల కార్ఖానా భూపతిపూర్‌

పాతరాతియుగం పనిముట్ల కార్ఖానా భూపతిపూర్‌

- Advertisement -

కొత్త తెలంగాణచరిత్ర బృందం పరిశోధకులు కొండవీటి గోపీవరప్రసాదరావు, మహమ్మద్‌ నసీరుద్దీన్‌, అహోబిలం కరుణాకర్‌ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్‌ గ్రామంలో 18.5498 ఉత్తర అక్షాంశం, 80.2680 తూర్పురేఖాంశాల మీద 12 పాతరాతియుగం రాతిపనిముట్లను గుర్తించారు. ఇవి 6అంగుళాల నుంచి 3 అంగుళాల పొడవు కలిగివున్నాయి.

ఈ రాతిపనిముట్లలో క్లీవర్లు, క్లీవర్‌ చేతిగొడ్డలి, స్క్రాపర్లు, చాపర్లు, ఫ్లేక్స్‌, చేతిగొడ్డండ్లున్నాయి. వీటి తయారీశైలిని పరిశీలించినపుడు ఇవి లక్ష నుంచి 40వేల సంవత్సరాలకు పూర్వానివి అని తెలిసింది. వీటిలో ద్వికుంభాకార చేతిగొడ్డలి, ఏకముఖ స్క్రాపర్లు, ద్విముఖ క్లీవర్లున్నాయి.
భూపతిపూర్‌ గ్రామానికి పడమర దిక్కున, ఏజెన్సీ అడవిప్రాంతంలో, దేవాదుల పైప్‌ లైన్‌ దగ్గరలో గోదావరిపాయపారే వాగులో ఈ పాతరాతియుగం రాతిపనిముట్లన్నీ లభించాయి. ఇక్కడ ఒక పెద్ద రాతిపనిముట్ల కార్ఖానే ఉంది. పాతరాతియుగం పనిముట్లే కాదు, వందలాది మధ్యరాతియుగం సూక్ష్మరాతిపనిముట్లు (మైక్రోలిథ్స్‌) కూడా దొరుకుతున్నాయి. ఇటువంటి పురావస్తు సంపదగల ప్రదేశాలను సంరక్షిస్తే, అవి మానవ పురాసంస్కతిని మనకు అందిస్తాయి.

క్షేత్ర పరిశోధకులు:
1. కొండవీటి గోపీవరప్రసాదరావు,
9247171248- కొత్త తెలంగాణచరిత్ర బృందం
2. అహోబిలం కరుణాకర్‌,
9640074420- కొత్త తెలంగాణచరిత్ర బృందం
3. మహమ్మద్‌ నసీరుద్దీన్‌,
9948918091- కొత్త తెలంగాణచరి త్రబృందం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -