పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణపై పడి దోచుకున్నరు
మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం ఆరోపణ
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే మొదలుకొని కల్వకుంట్ల కుటుంబం వరకు తెలంగాణపై పడి రాష్ట్ర వనరులు, సంపద అడ్డగోలుగా దోచుకున్నారని, వారి ఆస్తులు ఎన్నో వారికి తెలియదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నెలకొందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ఆరోపించారు. శుక్రవారం జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కూతురు కవిత, బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిందని, ఎందుకని అడిగితే వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి దోచుకున్న సొమ్ములో తన వాటా కావాలని అడిగితే మాఅన్న కేటీఆర్ ఇవ్వకపోవడంతో బయటకు వచ్చానని, అన్న కేటీఆర్, బావ హరీష్ రావుపై ఆరోపిస్తుందని, ఒక ప్రాజెక్టుకు రూ. 1100కోట్లకు బదులు రూ. 1700 కోట్లు కేటాయింపుతో, ఆ డబ్బంతా హరీష్ రావు నొక్కేశాడనే ఆరోపణలు బహిరంగంగా కవిత చెబుతుందని అన్నారు.
ముందుగా కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటం కాదని కేటీఆర్ హరీష్ రావు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి సవివరంగా తీసుకెళ్లి రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసి పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థాన ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మాజీ జడ్పీటీసీలు గుడి వంశీచందర్ రెడ్డి, బొల్లం అజయ్ (మణికంఠ), ఏఎంసీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మండల అధ్యక్షులు శిరీష్ రెడ్డి, కోళ్ల రవి, గడ్డమీది సురేష్, ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొనాసి క్రాంతి కుమార్, ఎండీ పాషా, మాజీ ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



