నవతెలంగాణ- ఆర్మూర్
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ కరపత్రాలను మంగళవారం పట్టణ బార్ హాల్ నందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ లు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ తెలంగాణ స్టేట్ కన్వెన్షన్ ఈనెల 20వ తేదీన కొత్తగూడెం నందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి వి.ఈశ్వరయ్య అతిథులుగా కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి పాటిల్ విశ్వనాథ్ , ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎస్ సరిత లు పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ విలువల రక్షణ, మైనార్టీ మరియు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల రిజర్వేషన్ల సంరక్షణ, ఒకే దేశం – ఒకే ఎన్నిక, రాజ్యాంగబద్ధంగా మహిళల ప్రాధాన్యత మరియు బార్ , బెంచ్ గౌరవ సమన్వయం పై చర్చ అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గజ్జల చైతన్య, కృష్ణ పండిత్, బేతు జగదీష్, చిలుక కిష్టయ్య, కృష్ణంరాజు, కొండి పవన్, గణేష్, రాజేశ్వర్ రైతుల న్యాయవాదులు పాల్గొన్నారు.



