- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో గురువారం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలలో 4,236 గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఇప్పటికే ఈ పాఠశాలలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. తదుపరి రెండు విడతల పోలింగ్ నేపథ్యంలో, ఈ నెల 13, 14, 16, 17 తేదీలలో కూడా పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపారు.
- Advertisement -



