- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.
- Advertisement -


