- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ .. డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు దశలవారీగా జరుగనున్నాయని తెలిపారు. ఫేజ్-2లో మండల పరిషత్ ఎన్నికలు, ఫేజ్-3లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు, భద్రతా బందోబస్తు, సిబ్బంది నియామకాలు వంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలిపారు. ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించి ప్రజాస్వామ్య ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో కోరారు.
- Advertisement -