నవతెలంగాణ – జగిత్యాల టౌన్
జగిత్యాల జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ ట్రాప్ కు గురయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో ని విజిలెన్స్ అండ్ క్వాలిటీకంట్రోల్ వింగ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా
పనిచేస్తున్న అనిల్ కుమార్ ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల కు చెందిన వెంకటేశం అనే కాంట్రాక్టర్ గతంలో చేసిన పలు పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చేందుకు అనిల్ కుమార్ లంచం డిమాండ్ చేశాడు. 23 లక్షల పైచిలుకు బిల్లులకు గాను రూ.18,000 డిమాండ్ చేయగా చివరకు పదివేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం 3,000 రూపాయలు ఇచ్చిన బాధితుడు ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం మరో 7 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని డీఎస్పీ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES