Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచెరువులో పడి పంచాయతీ కార్మికుడు మృతి

చెరువులో పడి పంచాయతీ కార్మికుడు మృతి

- Advertisement -

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్‌
ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా


నవతెలంగాణ-రామాయంపేట
చెరువుకు సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ బోరుబావికి మరమ్మతులు చేస్తూ, ప్రమాదవశాత్తు చెరువులో పడి పంచాయతీ కార్మికుడు మృతి చెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఊర చెరువు సమీపంలో ఉన్న బోరుబావికి మరమ్మతులు చేయడానికి వెళ్ళిన పంచాయతీ కార్మికుడు అనుముల నర్సింలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సమీపంలో ఉన్న ఇతర కార్మికులు కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇతర కార్మికులు, స్థానికులు నర్సింలు మృతదేహాన్ని బయటకి తీశారు.మృతిచెందిన పంచాయతీ కార్మికుడు నర్సింలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మృతదేహంతో రామాయంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విధినిర్వహణలో చెరువులో పడి మృతిచెందిన నర్సింలు కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలమణి డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి గ్రామాలకు నీరు, పారిశుద్ధ్యం వంటి సేవలను అందిస్తున్నారని, అయితే ప్రభుత్వం వారి భద్రతను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -