- Advertisement -
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి ఇంచార్జీ ఆర్‌డీఓగా ఆర్.పాండు బుధవారం బాద్యతలు స్వీకరించారు. సంగారెడ్డి ఆర్‌డీఓగా పనిచేసిన రవీందర్ రెడ్డిని హైదరాబాద్ రెవెన్యూశాఖకు అటాచ్ చేయగా అందోల్ ఆర్‌డీఓగా పనిచేస్తున్న ఆర్.పాండును సంగారెడ్డి ఆర్‌డీఓగా కలెక్టర్ ప్రావిణ్య నియమించారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి ఇంచార్జీ ఆర్‌డీఓగా బాద్యతలు స్వీకరించారు. ఆర్‌డీఓగా పాండు బాద్యతలు స్వీకరించడంతో సంగారెడ్డి తాసీల్దార్ జయరాం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
- Advertisement -