ఛేదనలో సఫారీ 74 ఆలౌట్ 101 పరుగులతో భారత్ ఘన విజయం
నవతెలంగాణ-కటక్
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (59 నాటౌట్, 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో కటక్ టీ20లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అర్ష్‌దీప్ సింగ్ (2/14), జశ్‌ప్రీత్ బుమ్రా (2/17), వరుణ్ చక్రవర్తి (2/19), అక్షర్ పటేల్ (2/7) మ్యాజిక్‌తో 176 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 74 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు, స్పిన్నర్లు కలిసికట్టుగా వికెట్ల వేటలో విజృంభించారు. పవర్‌ప్లేలోనే 45/3తో కష్టాల్లో కూరుకున్న దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత ఏమాత్రం కోలుకోలేదు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (0), డెవిడ్ మిల్లర్ (1), డెనోవాన్ ఫెరీరా (5), కేశవ్ మహరాజ్ (0), ఎన్రిచ్ నోకియా (1), లుథో (2) తేలిపోయారు. ఎడెన్ మార్‌క్రామ్ (14), ట్రిస్టన్ స్టబ్స్ (14) సహా డెవాల్డ్ బ్రెవిస్ (22, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మార్కో యాన్సెన్ (12, 12 బంతుల్లో 2 సిక్స్‌లు) దక్షిణాఫ్రికాను మూడంకెల స్కోరు దిశగా నడిపించే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. హార్దిక్ పాండ్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
హార్దిక్ మెరువగా
కీలక టాస్ ఓడిన భారత్ మంచు ప్రభావం ఉండే కటక్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. అభిషేక్ శర్మ (17) రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసినా.. వికెట్ నిలుపుకోలేదు. శుభ్‌మన్ గిల్ (4) మళ్లీ విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (12) సైతం నిరాశపరిచాడు. దీంతో 17/2తో భారత్ ఆరంభంలోనే కష్టాల్లో కూరుకుంది. తిలక్ వర్మ (26, 32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్), అక్షర్ పటేల్ (23, 21 బంతుల్లో 1 సిక్స్) ఇన్సింగ్స్‌ను చక్కదిద్దగా.. హార్దిక్ పాండ్య ధనాధన్ జోరుతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో దండెత్తిన హార్దిక్ 25 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. శివమ్ దూబె (11) రెండు బౌండరీలతో మెరిశాడు. 20 ఓవర్లలో 6 వికెట్లకు భారత్ 175 పరుగులు చేసింది. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి (3/31) రాణించాడు. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 న్యూ చంఢగీడ్‌లో గురువారం జరుగనుంది.
పాండ్య ఫటాఫట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



