బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ జెడ్పి చైర్పర్సన్
నవతెలంగాణ – గోవిందరావుపేట : పన్నాల శ్రీనివాసరెడ్డి మృతి బాధాకరమని ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని దుంపలగూడెం గ్రామంలో శ్రీనివాసరెడ్డి దశదిన కార్యక్రమానికి నాగజ్యోతి హాజరై శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పన్నాల శ్రీరామ్ రెడ్డి కుమారుడు పన్నాల శ్రీనివాస్ రెడ్డి పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం విచారకరమన్నారు. శ్రీరామ్ రెడ్డి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆమె అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి , వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి , గ్రామ పార్టీ అధ్యక్షులు బండి రాజశేఖర్ , మహిళా జిల్లా నాయకురాలు ఇరుప విజయ , యూత్ నాయకులు పొన్నం రవి , పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రారెడ్డి గట్టు ధర్మయ్య గూడూరు శ్రీనివాస్ , గోదా కనకయ్య , భూక్య వెంకట స్వామి చిన్ని కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
పన్నాల శ్రీనివాసరెడ్డి మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES