ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటీిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్‌ఎల్‌ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. తాజాగా హీరో శర్వానంద్ ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’తుకారం ఎలాంటి ఇండిస్టీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా మీద ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చాడు. ఈ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా నిజాయితీగా తీశాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. వర్ధన్‌ని చూస్తుంటే ఫస్ట్ సినిమా లాగా అనిపించలేదు. తను చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీమ్ అందరికీ చాలా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘ప్రేమ నిప్పులాంటిది. అది రెండు జీవితాలకు వెలుగునిచ్చే దీపం అవ్వచ్చు.. లేదా అడవిని దహించే కార్చిచ్చుగా మారొచ్చు’అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేమకథలోని డెప్త్ ప్రేక్షకులకి వెంటనే కనెక్ట్ అవుతుంది. లీడ్ పెయిర్ వర్ధన్, కష్ణప్రియ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. స్క్రీన్‌పై వారి ఎమోషన్స్ హార్ట్ టచింగ్ ఉన్నాయి. ఎంజీఆర్ తుకారాం టేకింగ్ అద్భుతంగా ఉంది. విజువల్స్, నేపధ్య సంగీతం అన్నీ గ్రాండ్‌గా ఉన్నాయి. ఎమోషన్స్, యాక్షన్, హదయాన్ని తాకే ప్రేమ కథతో ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీ పెంచింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘కాగితం పడవలు’ ట్రైలర్ విడుదల
- Advertisement -
- Advertisement -



