- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గోకుల్ తాండ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఖదీర్ మాట్లాడుతూ… పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, పిల్లల ప్రగతిని పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచించారు. మధ్యాహ్నం భోజనంలో వారానికి మూడు గుడ్లు అందించాలని తల్లిదండ్రులు సూచించారు. స్కావెంజర్ పాఠశాల పని వేళల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. హాజరు శాతం ఎక్కువగా ఉన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, సిఆర్పి మమ్మద్, వివి జ్యోతి, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



