నవతెలంగాణ – సదాశివనగర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల సదాశివ నగర్ లో ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం తల్లిదండ్రుల అధ్యాపక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మార్కుల వివరాలు హాజరు గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించడానికి అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారం ఎంతో ముఖ్యమైనదని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థులను ప్రతిరోజు కళాశాలకు పంపించే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులకు తెలియజేశారు.
కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ఫిజిక్స్ వాలా ఆన్లైన్ డిజిటల్ తరగతులు ప్రయోగశాలలను నిర్వహిస్తున్న విధానాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అనంతరం కళాశాల ఆవరణలో తల్లిదండ్రులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు భూమయ్య, పెంటయ్య, దీప, సోను భాయ్, లలిత తదితరులు, అధ్యాపకులు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES