Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-గండీడ్
మండలంలోని చిన్న వార్వాల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం శుక్రవారం ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు బోరు కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలపై,వారి చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,విద్యార్థులందరూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలని విద్యార్థులకు ఫోన్లు ఇవ్వరాదని వారి తల్లిదండ్రులను కోరారు. పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రుల ముందు ఉంచారు. వారు స్పందిస్తూ సమస్యలు పరిష్కరించే విధంగా తమ వంతు సహాయం అందిస్తామన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించాలని తల్లిదండ్రులు కోరారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -