Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి 

పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి 

- Advertisement -

25, 26 తేదీలలో ఢిల్లీలో జరిగే మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి 
మాల మహానాడు జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ 
నవతెలంగాణ-పాలకుర్తి

పార్లమెంటు భవనానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేసి మాలల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మాల మహానాడు జనగామ జిల్లా ఇన్చార్జి బుట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మాలల హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనమాల రాకేష్ ఆధ్వర్యంలో హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల బాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకన్నతో కలిసి వల్మిడి క్రాస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెంబర్ 99, 29 రాజ్యాంగ వ్యతిరేకం అని, తక్షణమే పునర్ సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల రిజర్వేషన్ లను 15 నుండి 20 శాతానికి పెంచి అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలని, దళితులపై జరిగే దాడులను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలలో, రాజ్యసభలలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సమస్యల సాధన కోసం మాలమహానాడు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి ప్రవీణ్, నీరుమాల శ్రీనివాస్, బూర్గుల సోమయ్య, దేవదానం,సోమేశ్, పెరపు కృష్టయ్య,బందెల యాదగిరి,కొంగరి బిక్షపతి, బందెల కృష్ణ, గిరి, రవి,గాజుల నరసింహ, వీరస్వామి, బూర్గుల బీక్షం,యాకన్న, ముకేష్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -