– రోడ్డు ప్రమాదానికి గురైన మహిళను ఆసుపత్రికి తరలింపు
– బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేత
నవతెలంగాణ – రాయపర్తి : అనుదినం ప్రజా సేవలో నిమగ్నమై అనేక సేవా కార్యక్రమాలు చేపడుతు అభాగ్యులకు అండగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిలుస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకుడు ఐత రవి తల్లి ఎల్లమ్మ కోతుల బెడదతో ఇంటి స్లాబ్ పైనుండి క్రింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటలో చికిత్స అందిస్తుంన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి నాయకులతో కలిసి హన్మకొండకు వెళుతుండగా రంగశాయి పేట వద్ద ఒక మహిళ రోడ్డు ప్రమాదానికి గురికాగా వెంటనే స్పందించి పోలీసుల సహకారంతో ఆమెను ఆస్పత్రికి పంపించారు.
తదుపరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎల్లమ్మను పరామర్శించి రవితో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు. పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి ఒక కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, రాయపర్తి మాజీ సర్పంచ్ గారె నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రాంచందర్, రాయపర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్, పోగులకొండ వేణు, ఎండీ యూసఫ్, సంకినేని ఎల్లస్వామి, చిలువేరు సాయి గౌడ్, ఉబ్బని సింహాద్రి, పెద్దగోని జీవన్, పిరని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అభాగ్యులకు అండగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES