Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాల క్యాలెండర్ ఆవిష్కరణ 

పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాల క్యాలెండర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని పార్వతమ్మ గూడెం మండల ప్రాథమికోన్నత పాఠశాల క్యాలెండర్‌ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆవిష్కరించినట్లు మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాలకు కొంతమంది సహకరించడం వల్ల సంతోషంగా ఉందని అన్నారు. విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి గొప్పదని తెలిపారు. ప్రహరి గోడ లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని మాకు గోడ ఇప్పించండి అని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మీకు ప్రహరీ గోడ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. విద్యాభివృద్ధికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి. మాజీ బ్లాక్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ వల్లబోజు వెంకటేశ్వర్లు, హెచ్ అలివేలు, పెరుమాండ్ల జగన్ గౌడ్, ప్రభుత్వ పాఠశాల స్కూల్ పేరా క్యాలెండర్ ఆవిష్కరించడం పట్ల హర్ష వ్యక్తం పార్వతమ్మ గూడెం సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఫోటోలు క్యాలెండర్ పై వేసి విద్యార్థికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు ఆ గ్రామ సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ తెలిపారు.

గురువారం పాఠశాల చదువుతున్న విద్యార్థులకు క్యాలెండర్ ను పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తేదీలు, వారములు పండగలు చూసుకొని వారి వారి చదువుల పట్ల నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించి విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత శిఖరాలకు దిగి పాఠశాల పేరు ప్రఖ్యాతలు చాటి చెప్పే అంత పెద్ద స్థాయికి ఎదగాలని విద్యార్థులను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెల్లికుదురు గ్రామ పంచాయతీ సర్పంచ్ పులి వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మద్ది రాజేష్,నెల్లికుదురు గ్రామ పార్టీ అధ్యక్షులు రత్నపురం యాకయ్య,పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -