Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి..

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి..

- Advertisement -

నవతెలంగాణ – తాంసి
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించే బాధ్యత మన అందరిపై ఉంటుందని, ఈ విషయాన్ని మర్చి పోవద్దని జిల్లా అదనపు ఉట్నూర్ వైద్యాధికారి డాక్టర్ మెస్రం మనోహర్ డాక్టర్ కు సిబ్బందికి సూచించారు. శనివారం రోజున భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్యాన్ని రోజు వారి సిబ్బంది హాజరు రోగులకు నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఎక్కువ శాతంలో గిరిజన గ్రామాల కుటుంబాలు ఉన్నాయి.

ఆ కుటుంబాలకు చెందిన ప్రజలు అనారోగ్య బారిన పడితే హాస్పిటల్లో చికిత్సలు చేసుకోవడానికి ముందుకు రారు అలాంటి గ్రామాలకు మన సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని అనారోగ్య బారిన పాడిన వారికి వైద్య సేవలు అందించి ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గర్భిణీ మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలకు అందిస్తూ ఆరోగ్య కేంద్రాల్లోని ప్రసవాలు జరిగేటట్లు ఆయా గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలు చూసుకోవాలని అన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించాలి అన్నారు. వర్షాకాలం దృశ్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్, మండల సూపర్వైజర్ లింగంపల్లి జ్ఞానేశ్వర్, ఆరోగ్య సిబ్బంది మేఘన, నఫిజ, విష్ణు కుమార్ ,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి, ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad