నవతెలంగాణ – కంఠేశ్వర్
లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ కు ఇచ్చిన టెండర్ ను వెంటనే రద్దు చెయ్యండి అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఇరిగేషన్ కార్యాలయం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల బకాయి వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. అలీ సాగర్ ,గుత్ప లిఫ్టి ఇరిగేషన్ లో పనిచేసే కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించకుండా నాలుగు, ఐదు నెలల పాటు బకాయిలు పెడుతూ కార్మికులు తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్నారని సకాలంలో నెలనెలా వేతనాలు చెల్లించకపోవడం మూలంగా నిరంతరం పనిచేసిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని బాధ్యతారహితమని ఇరిగేషన్ అధికారులు కూడా కార్మికుల వేతనాలు చెల్లింపు పై పట్టించుకోకపోవడం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల అయినంత మాత్రాన వారి బాధ్యత తమది కాదన్నట్టుగా వివరించటం అధికారులు తప్పించుకోవటమే అవుతుందని ఆమె అన్నారు. వేతనాల గురించి కాంట్రాక్టర్ను అడిగితే సంవత్సరంకు పైగా తమకు బిల్లులు రాలేదని అందువలన వేతనాలు చెల్లించటం లేదని అంటున్నారు. కాంట్రాక్టర్ బిల్లులకి వేతనాలకి పొంతన పెట్టటం సరైనది కాదని ఆమె అన్నారు.
కాంట్రాక్టర్ తో జరిగిన ఒప్పందం ప్రకారం నెల నెల వేతనాలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు కార్మికులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లించకుంటే లేనియెడల కార్మికులు సమ్మెకు వెళ్తారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల నాయకులు గణేష్, కార్తీక్, బుచ్చన్న, సందీప్, పవన్ , రమేష్ అజయ్, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.