అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి
 మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు 
నవతెలంగాణ-అచ్చంపేట 
అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డుల పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు తమ ఇంటి పన్నులు చెల్లించి పట్టణ  అభివృద్ధికి సహకరించాలని మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన నవ తెలంగాణతో మాట్లాడారు. పట్టణంలో 6300 పైగా నివాస గృహాలు ఉన్నాయి రోజురోజుకు పట్టణం విస్తరిస్తుంది పన్నుల బకాయలు పేరుకుపోతున్నాయన్నారు. రూ 3 కోట్లకు పైగా పన్నులు బకాయిలు ఉన్నాయని, ఇప్పటివరకు రూ.1.కోటి 50 లక్షలు సిబ్బంది వసూలు చేశారని తెలిపారు. ఇంకా బకాయిలు ఉన్న వారు పన్నులు వసూలు చేయడానికి వస్తున్న మునిసిపల్ సిబ్బందితో ఘర్షణ పడకుండా పన్నులు చెల్లించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్నులు చాలాకాలంగా చెల్లించడం లేదు. రూ 74 లక్షలు బకాయిలు  ఉన్నాయి. వారికి నోటీసులు జారీ చేసి, పన్నులు వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద అచ్చంపేట మున్సిపాలిటీకి 15 కోట్లు వచ్చాయి. 8 కోట్ల రూపాయలతో రాజీవ్, ఎన్టీఆర్ స్టేడియం మరమ్మత్తులు, విస్తరణ  పనులు, రూ 3 కోట్లతో సీసీ రోడ్లు, నూతన డ్రైనేజీ నిర్మాణాలు, 1కోటి రూపాయలతో మహిళా భవనం మరమ్మత్తులు,  రూ 3 కోట్లతో మునిసిపాలిటీ లో
పార్కు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. పట్టణం విస్తరిస్తుంది, నివాస గృహాలు పెరుగుతున్నాయి చెత్త సేకరణ కోసం నూతనంగా ఆటోలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణ నిర్మాణాలపై అధికారులు కఠినంగా ఉండాలని అవసరమైతే నోటీసులు జారీ చేసి స్పందన రాకుంటే చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పట్టణంలో మున్సిపాలిటీ  అనుమతులు లేకుండా డిజిటల్ ప్రచార బోర్డులు నిర్వహిస్తున్న  నిర్వాకులపై యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సంబంధించిన సెక్షన్ అధికారులను ఆదేశించారు.
సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి
- Advertisement -
- Advertisement -

                                    

