నవతెలంగాణ – కంఠేశ్వర్
మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహ సభలను నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆగస్టు 7 న గోవా రాష్ట్రంలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 10వ మహాసభ నిర్వహించునున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఆదివారం నిజామాబాద్ జిల్లా బీసీ జిల్లా సంఘం నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఆవిష్కరింపజేసారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నుండి పెద్ద ఎత్తున బీసీలు ఓ బి సి జాతీయ మహాసభ కొరకు గోవా కు తరలి వెళ్లడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% ఇవ్వాలనుకున్న రిజర్వేషన్లను కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేసారు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు ఆకుల ప్రసాద్, దర్శనం దేవేదర్, చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, బసవసాయి, సదానంద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీ మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించిన పీసీసీ చీఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES