Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ కు సన్మానం

పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఇటీవల నియామకమైన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కామారెడ్డి పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో కల్కి మానవ సేవా సమితి, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో కల్కి ఆలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనీ ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షిస్తూ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు ఆలయానికి విచ్చేసిన పీసీసీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావును సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గంప ప్రసాద్, ఆలయ సేవకులు ఎర్రం విజయ్, ఎర్రం సూర్యకాంతం, నాయకులు గోనె శ్రీనివాస్, కిరణ్, సర్వర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -