నవతెలంగాణ – కామారెడ్డి : 2026 నూతన సంవత్సర కామారెడ్డి నియోజకవర్గం క్యాలెండర్ ను తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గంకు చెందిన టిపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన క్యాలెండర్ ను విడుదల చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. రాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు. నూతన సంవత్సర క్యాలెండర్ లో కాంగ్రెస్ పథకాలు, అభివృద్ధి పనులు పొందుపరచడం సంతోషంగా ఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా, తాజా మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, శంకర్ రావు, జూలూరి సుధాకర్, తాటి ప్రసాద్, సాయిబాబా, సలీం, గడ్డమీది మహేష్, చాట్ల వంశీ, రంగా రమేష్ గౌడ్, గౌరీ నవీన్, సేవాదళ్ అధ్యక్షులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన పీసీసీ అధ్యక్షులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



