నవతెలంగాణ – హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందన్నారు. ప్రాజెక్టు పేరుతో రూ. లక్షల కోట్లు వృథా చేశారని ఇంజినీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదని ఆరోపించారు. ఇవాళ జనహిత పాదయాత్రలో భాగంగా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ సొంత లాభం మాత్రమే చూసుకున్నారను. తనకు ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ చెప్పారని ఆరోపించారు.
మెడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారని ఇది చిన్న విషయమా అని ప్రశ్నించారు. ఈ -కార్ రేస్ లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కక తప్పదన్నారు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట అని బీఆర్ఎస్ చేతకానితనం వల్లే బనకచర్ల ప్రాజెక్టు వస్తుందని దుయ్యబట్టారు. మేము మేల్కొని ఫిర్యాదు చేస్తే ప్రాజెక్టు పనులు గాయన్నారు. ఇతర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయని ప్రతిపక్షాలు చేసిన కుట్రలతోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులు సహజం.. పార్టీలో గ్రూపులు ఉండాలన్నారు. పాత, కొత్త కలయికతో పార్టీ చాలా దృఢంగా ఉన్నారన్నారు.