Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిశాంతి కుసుమం!

శాంతి కుసుమం!

- Advertisement -

ఆయుధాలు పాలిస్తున్నాయి..
వాటిపై ఆధిపత్యం వహించాల్సిన మనుషులు
అహం మత్తులో వాటికి బానిసలయ్యేరు!
యుద్ధక్షేత్రంలో ఏ పొట్ట కోసినా దుర్భాషలే
ఏ పుట్ట తవ్వినా క్షిపణులే
అన్నవస్త్రాల కాలం పోయిందేమో
అణ్వస్త్రాలకు ఆదరణ పెరిగింది
యుద్ధం కుంభవృష్టియై కురుస్తున్నా
యుద్ధమేఘాలు కరగటం లేదెందుకో
వినాశనం కళ్లముందే వికటాట్టహాసం చేస్తున్నా
ఏదో పొర కమ్మేసినట్టు
మృత్యువు వైపే అడుగులు పడుతున్నారు
మరణం వైపే మాటలింకా దొర్లుతున్నాయి
ఇంత ద్వేషం ఇంత స్వార్థం
చాపకింద నీరులా ఎలా కమ్మేసిందో
జాతుల పోరాటం, అహాల ఆరాటం
వెనకడుగు
వేయనీయడం లేదా?
ప్రపంచం జైలులో మనిషీ మనిషీ కలిసి
మనుగడ సాగించక తప్పదు
నేలంతా ఒక్కటే! మృత్యువుని ఆహ్వానిస్తే
అది నీ శత్రువుతో పాటు నిన్ను కూడా
కబళిస్తుంది సుమా!
మనందరి క్షేమం మనం కోరుకుంటేనే
ఇంతటి క్షామంలో
శాంతి సుమాలు వికసిస్తాయి!
-భీమవరపు పురుషోత్తమ్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad