- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని జప్తి సదగోడు గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు కుటుంబ సభ్యులు ఉపవాస దీక్షతో రంగు రంగుల పూలు, బోట్లతో బోనాలు చేసి పురవీధుల గుండా శివ సత్తుల నడుమ ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు చేరుకొని పూజలు చేసి అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని భక్తులు తీసుకొచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు, కుల పెద్దలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -