Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రచారంలో దూసుకుపోతున్న పెద్దతూండ్ల సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి మందపెల్లి శ్రీధర్ 

ప్రచారంలో దూసుకుపోతున్న పెద్దతూండ్ల సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి మందపెల్లి శ్రీధర్ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి మందపెల్లి శ్రీధర్ గెలుపు దిశగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో రెండు పర్యాయాలు వార్డు సభ్యులుగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు, అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిన అనుభవం ఉందన్నారు.ప్రజల్లో సౌమ్యుడుగా ఉన్న పేరుతో పాటు మృదు స్వాభావం కలిగిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. బరహీన వర్గాలకు చెందిన బహుజన బిడ్డగా చదువుకున్న వ్యక్తిగా గ్రామా పరిపాలన పై అనుభవం ఉన్న శ్రీధర్ తాను పుట్టిన గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికై అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బరిలో నిలిచారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని బరోసా కల్పిస్తున్నారు. గ్రామం లోని ప్రధాన సమస్యల మహిళల అభివృద్ధి, వృద్ధుల, పెన్షన్లు, సిసి రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులపై ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు ఆశీర్వదిస్తే సహకరిస్తే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తామని ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. తమపై నమ్మకంతో గ్రామస్తులు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -