నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు పెద్దవంగర జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ కంచర్ల ప్రభాకర్ తెలిపారు. జూలై 30 న మహబూబాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దేశబోయిన తేజశ్రీ లాంగ్ జంప్, 60 మీటర్స్ పరుగులో ద్వితీయ స్థానం, కన్నె భరత్ కుమార్ లాంగ్ జంప్, 60 మీటర్స్ పరుగులో ద్వితీయ, తృతీయ స్థానాలు, అండర్ 14 విభాగంలో కన్నె నందిని కిడ్స్ జవాలిన్ త్రో, లాంగ్ జంప్ లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న జనగామ జిల్లాలోని మినీ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో బుధారపు శ్రీనివాస్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పెద్దవంగర విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES