Sunday, July 6, 2025
E-PAPER
Homeవరంగల్ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో మెరిసిన పెద్దవంగర విద్యార్థులు 

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో మెరిసిన పెద్దవంగర విద్యార్థులు 

- Advertisement -

• మండలం నుండి 13 మంది విద్యార్థులు ఎంపిక 


నవతెలంగాణ -పెద్దవంగర


బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో పెద్దవంగర మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో  మండలం నుండి మొత్తం 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గతంలో ఎన్నడు లేని విధంగా బాసర ట్రిపుల్ ఐటికి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రభుత్వ పాఠశాలలపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దవంగర ఉన్నత పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు కె. మేఘన, ఎం. శ్రీవల్లి, ఎండీ. అఫ్సర్, బి. కీర్తన, వి. అజయ్, చిట్యాల ఉన్నత పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఎ. అభిషేక్, టి. భవాని, డి. మహేష్, కె. స్వాతి, ఈ. యగ్న, అవుతాపురం ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు విద్యార్ధులు టి. శివతేజ, బి. స్పందన, బొమ్మకల్ ఉన్నత పాఠశాల నుండి జి. నితిన్ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను ఎంఈవో బుధారపు శ్రీనివాస్, ఆయా పాఠశాలల హెచ్ఎం లు విజయ్ కుమార్, కళాధర్, లీల శోభారాణి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -