రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్‌లో, సినిమా లవర్స్‌లో అంచనాలు పీక్స్‌కి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మేకర్స్ లేటెస్ట్‌గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహ్మాన్ స్టూడియోలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని కంపోజ్ చేశారు. ఆడియన్స్, ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్‌ని రెడీ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియాగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -