Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా యువజన అధ్యక్షులుగా పెండెం శ్రీకాంత్ 

బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా యువజన అధ్యక్షులుగా పెండెం శ్రీకాంత్ 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
బిసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా యువజన అధ్యక్షులుగా శుక్రవారం పెండెం శ్రీకాంత్ నియమితులయ్యారు.  జిల్లా కేంద్రంలోని హరిత హోటల్ యందు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్  ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్  విచ్చేసి ములుగు జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా పెండెం శ్రీకాంత్ ని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. 

ఈ సందర్భముగా నూతన అధ్యక్షుడు శ్రీకాంత్  మాట్లాడుతూ బీసీ కులాల అభ్యున్నతికి పాటుపడతానని, బీసీ కులాలను అందరిని ఒక తాటిమీదకు తెచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా కృషి చేస్తానని, ముఖ్యంగా బీసీ కులాల యువత ఉపాధి కోసం పాటు పడతానని, అహర్నిశలు బీసీ కులాలన్నింటినీ ఐకమత్యంగా ఉంచుతూ ముందుకు సాగుతామని, బీసీ కులాల సమస్యల పరిష్కారంలో నా వంతుగా పత్ర పోషిస్తానని అన్నారు. అలాగే నన్ను నమ్మి నాకు ములుగు జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్ష పదవిని ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ కి, ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ కి, ములుగు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చింతనిప్పుల బిక్షపతి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -