Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ బిల్లులు చెల్లించాలి

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

- Advertisement -

కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని  సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఓ ప్రశాంత్ కు అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ.. వేతనాలతోపాటు, నాలుగు నెలల పెండింగ్ బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ, 10 వేలు వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ కోడిగుడ్లు, ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, కార్యదర్శి హరిశంకర్ మధ్యాహ్న భోజన కార్మికులు శేఖర్, పోశెట్టి, సావిత్రి, రజియా, హాతిఫా, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -