Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి

పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి

- Advertisement -

ది తెలంగాణ పెన్షనర్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గాజుల నరసయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్‌

పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ది తెలంగాణ పెన్షనర్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గాజుల నరసయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తెలంగాణ పెన్షనర్స్‌ కేంద్ర సంఘం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన్‌ కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ.. వేములవాడ, యాదాద్రి, భద్రాచలం మార్కెట్‌ కమిటీలు, సహకార సంస్థలు, గ్రంథాలయాలు, వాటర్స్‌ వర్క్‌ సంస్థల్లో ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు విడుదల చేయాలని కోరారు. గ్రంథాలయ సంస్థలు రిటైర్డ్‌ ఉద్యోగులకు జీతభత్యాలు వెంటనే విడుదల చేయాలన్నారు. 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి కమ్యుటేషన్‌ పెన్షన్‌ విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న హెల్త్‌ కార్డులు ఆస్పత్రుల్లో పరిగణలోనికి తీసుకోవడం లేదని, మళ్లీ తిరిగి పాత పద్ధతి రీయింబర్స్‌మెంట్‌ సిస్టం కొనసాగుతున్నదని అన్నారు. పే కమిషనర్‌ సూచించిన విధంగా బేసిక్‌లో ఒక శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హెల్డ్‌ కార్డులు అన్ని ఆస్పత్రుల్లోనూ అన్ని రుగ్మతలకూ పరిమతి లేకుండా నాణ్యమైన చికిత్స కోసం పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రెండు మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన పెన్షన్‌ బెనిఫిట్స్‌, కొత్త పీఆర్సీ నివేదిక తెప్పించుకొని 43 శాతం పీఆర్సీ తక్షణమే విడుదల చేయాలని కోరారు. మెడికల్‌ రీయింబర్స్‌మంట్‌ పెండింగ్‌ బిల్లులను తొందరగా విడుదల చేయాలన్నారు. వీటిని 15 రోజుల్లోగా విడుదల చేయకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రేమ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు మొహమ్మద్‌ రఫీ, ట్రెజరర్‌ శ్రావణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి నవనీత్‌ కౌర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు హెచ్‌.రాములు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -