నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న వితంతులకు, వృద్ధులకు పెన్షన్ లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. గ్రీవెన్స్ డే సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునప్పటికీ పెన్షన్ రాకపోవడం తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే లబ్ధిదారులకు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అధికారులు స్పందిస్తూ 2023 జూన్ వరకు పెన్షన్లు ఇచ్చామని, ఏమైనా కొన్ని సాంకేతిక కారణాలతో పెన్షన్లు ఆగిపోయాయేమో వెంటనే స్థానిక అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేశం,రెండో వార్డ్ మెంబర్ ఏదునూరి కళ్యాణి, సీపీఐ(ఎం) నాయకులు ఎదునూరి వెంకటేశంలు పాల్గొన్నారు
పెండింగ్‌లో ఉన్న ఫించన్ మంజూరు చేయాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



