ప్రజావాణిలో ఆర్పిల వినతి
నవతెలంగాణ – కంఠేశ్వర్
పెండింగ్ లో ఉన్న జీతాలు ఇప్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఆర్పీ యూనియన్ అరుణోదయ రిసోర్స్ పర్సన్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి స్వర్ణలత మాట్లాడుతూ..మెప్మా ఆర్పి లకి ఆరు నెలల నుండి వేతనం రావడం లేదు అలాగే జీవో 164 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ 164 ప్రకారం శ్రీనిధి వి ఎల్ ఆర్ నుంచి రిసోర్స్ పర్సన్స్ కి వేతనాలు ఇవ్వాలని ఉందని అన్నారు. దానివల్ల రిసోర్స్ పర్సన్స్ కి గౌరవ వేతనం సరిగా రావడం లేదని దానికోసమే 164 జీవోని రద్దు చేయాలని మెప్మా రిసోర్స్ పర్సన్స్ డిమాండ్ చేశారు.
అలాగే మార్చి 2025 సంవత్సరంలో సేర్ప్ మెప్మా విలీనం అంటూ జీవో 16 వచ్చింది కానీ మాకు మున్సిపల్ నుండి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మాకు సెర్ప్ మెప్మా విలీనం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అని వాపోయారు. అలాగే మేము చేసిన సర్వేల కంటి వెలుగు గాని ,ప్రజా పాలన గానీ, సమగ్ర కుటుంబ సర్వే లు చేసినా గాని ఇంతవరకు ఎలాంటి రేమ్యురేషన్ ఇవ్వలేదు వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్పీ యూనియన్ అరుణోదయ రిసోర్స్ పర్సన్ సొసైటీ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి స్వర్ణలత జిల్లా కార్యదర్శి మంజుల జిల్లా కోశాధికారి స్వప్న జ్యోతి సుమలత విజయ జయ తదితర ఆర్పీలు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES