Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి..

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి..

- Advertisement -

ఫీజులతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి..
స్కాలర్షిప్ విడుదలకై ఈనెల 14 మండల కేంద్రాల్లో 21న చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి..
ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు మేడబోయిన మమత. .
నవతెలంగాణ – భువనగిరి
: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని స్కాలర్షిప్ లతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు అందరికీ ఇవ్వాలని ఈనెల 14 మండల కేంద్రాల్లో 21న కలెక్టర్ రేట్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత అన్నారు. శనివారం  భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ ఉన్న 8 వేల కోట్లు ,స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్  విడుదల చేయాలని నిరసన  చేపట్టామన్నారు. 

పెండింగ్లో ఉన్న రూ. 8000  కోట్ల పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. స్కాలర్షిప్ రాక  రాష్ట్రంలో విద్యార్థులు, ప్రైవేటు యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటున్నారని తెలిపారు. వడ్డీలు తెచ్చి మేం విద్యాసంస్థలను నడపలేము అని పరీక్షలు బాయ్ కాట్ చేశారన్నారు. ఇంకోపక్క విద్యార్థులు నుండి పెండింగ్ ఫీజులను బలవంతపు వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పీజు రియంబర్స్మెంట్  పథకాన్ని మరింత పటిష్టమైన పథకంగా రూపోందించి బకాయిలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 13లక్షల మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే సర్టీఫికేట్స్ కోసం కాలేజీలు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయకుంటే ఆదుకోవాలని, లేనియెడల ఎక్కడికి అక్కడ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్, జిల్లా సహాయ కార్యదర్శి తిగుళ్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు  పుట్టల ఉదయ్, ఈర్ల కార్తీక్, భవాని శంకర్,ధరావత్ జగన్, బుగ్గ ఉదయ్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -