Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి

- Advertisement -

– స్కాలర్షిప్ సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి
– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజు
నవతెలంగాణ – భువనగిరి
: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రలో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్,  స్కాలర్ షిప్స్ విడుదల చేయాలనిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు అన్నారు. గురువారం  భువనగిరి భువనగిరిలోని ఉన్నత విద్యాసంస్థలు డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఇంటర్, విద్యాసంస్థలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు  బంద్ నిర్వహించారు. 

, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి లావుడియ రాజు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ళ నుండి సుమారు 8 వేల కోట్లు పైగా బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలు దశలు వారీగా విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం వారు ఇచ్చిన టోకెన్లు  నిధులు ఇవ్వలేదని తెలిపారు. విద్యాసంస్థలల యాజామన్యాలు బంద్ ప్రకటించి సంవత్సరం కాలంగా పోరాడితే రూ. 1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వారు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా హామీ తప్పిందని అన్నారు.

కనీసం యాజామన్యాలు ఫీజులు రాలేదని పేరుతో రీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ ఫీజులు విద్యార్థుల నుండి బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని పేద ఎస్.సి.,ఎస్టీ, వెనుకబడిన, మైనార్టీ వర్గాలు విద్యార్థుల లక్షలాది రూపాయలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్ధులకు భరోసా ఇచ్చేలా ఫీజుల చెల్లింపుకోసం గ్యారెంటీ ఇచ్చి జీ.వో. ఇచ్చి విద్యార్థులు భవిష్యత్ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి, కనీసం ఇన్ని సంవత్సరాలు నుండి పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అన్నారు. నవంబర్ మొదటి వారంలో బకాయిలు విడుదల చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరణ చేసి ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ జగన్ నాయక్, హిందు రాణి, జిల్లా కమిటీ సభ్యులు ఈర్ల కార్తీక్, నాయకులు సాయినంద్ భవాని శంకర్, శ్రీకాంత్,రెడ్డి, అనూష,  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -